మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలులో ఉన్న ఎర్లీబర్డ్ ఆస్తి పన్ను రాయితీ పథకం మరో రెండు రోజుల్లో ముగియనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30, 2026 లోపు చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.