తెలంగాణ స్టేట్ ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలతో ముందుకు వెళ్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, దళితబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి బీఆర్ఎస్ పథకాలేనని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మనిషి అయితే, కేసీఆర్ ఫామ్ హౌస్ మనిషి అని విమర్శించారు.