సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అనుచరులతో కలిసి డప్పు కొట్టి అలరించారు. తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఈనెల 19న ఘనంగా జరుపుకోనున్నట్లు మల్లారెడ్డి వెల్లడించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, గల్ఫ్ యుద్ధం త్వరగా ముగియాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.