రైల్వే ప్రయాణికుల రక్షణ, నేరాల నియంత్రణ కోసం జీఆర్పీ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారని రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. బుధవారం లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ వార్షిక సమావేశం జరిగింది. 2025లో జీఆర్పీ పరిధిలో జరిగిన నేరాలు, రికవరీలు, నేరస్థుల అరెస్టులపై వివరాలు వెల్లడించారు. నేరాలను పూర్తిగా అరికట్టడానికి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కలిసి పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.