తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణశాఖ

0చూసినవారు
తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణశాఖ
తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాగల మూడు రోజుల వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. వాయువ్య ఉత్తర ప్రదేశ్ నుండి ఉత్తర జార్ఖండ్ మీదుగా ఉత్తరాంధ్ర కోస్తా తీరం వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్