సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో, శనివారం జూబ్లీ బస్ బస్టాండ్ (JBS) ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నగర వాసులు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్‌లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, రద్దీకి తగినన్ని బస్సులు నడపాలని కోరుతున్నారు.