సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్‌లో హోళీ సంబరాలు విభిన్న సంప్రదాయాల కలయికతో అత్యంత వైభవంగా జరిగాయి. మార్వాడీ సమాజం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కామ దహనం నిర్వహించి భక్తి శ్రద్ధలతో పండుగను ప్రారంభించారు. మరోవైపు, మోండా డివిజన్ బండిమేట్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెయిన్ డ్యాన్స్ యువతను, చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలు సాంప్రదాయం, ఆధునికత కలబోతగా సాగాయి.