సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

4చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను జీఆర్పి సికింద్రాబాద్, ఈగలు టీమ్, ఆర్పిఎఫ్ సంయుక్తంగా పట్టుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని, రూ. 20.56 లక్షల విలువైన 41 కిలోలకు పైగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.