ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన చంద్రకాంత్ (38) అనే వీడియోగ్రాఫర్ మల్కాజిగిరి స్టేషన్ వద్ద సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మీర్పేట్ గాయత్రీనగర్ కు చెందిన చంద్రకాంత్ కు భార్య, కుమార్తె ఉన్నారు. ఇంట్లో గొడవ తర్వాత తీవ్ర ఆందోళనతో బయటకు వెళ్లిన ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అతని జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.