హైదరాబాద్‌: గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై దాడి

0చూసినవారు
హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మంద మల్లమ్మ చౌరస్తా వద్ద గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన ప్రేమ్ కుమార్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.