
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు.. ఎనిమిది మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈదురుగాలుల కారణంగా గోడ కూలి నలుగురు రైతులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంటను కాపాడేందుకు రైతులు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మహిళలు, ఓ ఉపాధి కూలీ మృతిచెందారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో రైతులకు పాడి, పంట నష్టం జరిగింది.




