భూమి హక్కు సభ గోడ పత్రిక ఆవిష్కరణ

0చూసినవారు
భూమి హక్కు సభ గోడ పత్రిక ఆవిష్కరణ
తెలంగాణ భూ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో భూమి హక్కు సభ నిర్వహించనున్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఈ సభలో డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ నంద్రు నరసింహ, గడ్డం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్