తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ డీఎస్పీ నళినిని శనివారం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. బోయిన్ పల్లిలోని పతంజలి వెల్నెస్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఆమెను కలిసిన ఎంపీ, ఉద్యమం కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చికిత్స, సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.