ముషీరాబాద్ పరిధిలోని గాంధీనగర్ డివిజన్ నర్మద ఆస్పత్రి పక్కన నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి కృష్ణారావు (47) అనే వ్యక్తి మృతి చెందాడు. నిర్మాణంలో భాగంగా కర్రలు కడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.