వ్యక్తి హత్య.. ఇద్దరు అరెస్ట్

1086చూసినవారు
వ్యక్తి హత్య.. ఇద్దరు అరెస్ట్
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ముషీరాబాద్ భోలక్‌పూర్ ఇందిరానగర్‌కు చెందిన జహంగీర్, జమిస్తాన్‌పూర్‌కు చెందిన సయ్యద్ లు, 23వ తేదీ సాయంత్రం ఆర్థిక లావాదేవీల గొడవ కారణంగా పద్మారావునగర్‌లోని వైన్స్ వద్ద మహ్మద్ అలీమ్ (43)ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసులో నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్