సికింద్రాబాద్‌లో ఘనంగా ఎంఈఎస్ 104వ దినోత్సవ వేడుకలు

3చూసినవారు
సికింద్రాబాద్‌లో ఘనంగా ఎంఈఎస్ 104వ దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్‌లో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) 104వ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆర్మీ, సివిల్ అధికారులు, ఉద్యోగుల కోసం క్రికెట్, వాలీబాల్, క్యారం, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. గ్యారేసన్ ఇంజనీరింగ్ యుటిలిటీ ఓవరాల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో జీఈ సౌత్, జీఈ నార్త్, జీఈ గోల్కొండ, సీడబ్ల్యూఈ-1, సీడబ్ల్యూఈ-2 అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్