హైదరాబాద్‌లో MG ఎలక్ట్రిక్ వాహనాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు MG ఈవీ కార్ల కొనుగోలుపై ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పర్యావరణ హితం కోసం ఈవీల వాడకం పెరగాలని, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని మంత్రి కోరారు. కాలుష్య నివారణలో భాగంగా ప్రభుత్వం ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు.