సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్ పేట్, సనత్ నగర్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు నూతన మొబైల్ ఫోన్లను అందించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల వివరాలు, పౌష్టికాహార పంపిణీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని, అక్కడి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.