ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ పుట్టినరోజు సందర్భంగా 'సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్', 'స్కూల్ ఆఫ్ సిబిఎన్' ఆధ్వర్యంలో
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా,
ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి అని, ఆయనకు భారతరత్న ఇవ్వడంలో జాప్యం తగదని అభిమానులు అన్నారు. మహిళా సాధికారత, కిలో 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.