పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో అగ్గి

3చూసినవారు
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో అగ్గి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి నిరాకరించడంతో, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 'హైదరాబాద్‌లో అడుగు పెట్టడానికి నీకేం పని అంటూ నన్ను బెదిరిస్తున్నారు. ఇది హైదరాబాదా లేక పాకిస్తానా, పాలస్తీనా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, 'బరాబర్ తెలంగాణ మా అయ్యా జాగీరే! ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం' అని కౌంటర్ ఇచ్చారు. ఏపీలోనే దిక్కులేని పవన్ ఇక్కడికొచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా పవన్‌పై విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్