సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో విఠలేశ్వర రథయాత్ర ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ రథయాత్ర జనరల్ బజార్ నుండి ప్రారంభం అయి మోండా మార్కెట్ మీదుగా తిరిగి మళ్లీ జనరల్ బజార్ లోని విఠలేశ్వర అలయం చేరుకొని ముగుస్తుంది. ఈ రథయాత్రకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్ శాఖ ఏఈ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.