బోరబండలో రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

316చూసినవారు
బోరబండలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. "కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయాం" అంటూ నినాదాలు చేసిన రైతులు, జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని అవగాహన కల్పించేందుకు యత్నించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్నారనే కారణంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను నిలువరించి, కేసులు పెడతామని హెచ్చరించి పంపించినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్