రాజస్థాన్ కు చెందిన కార్పెంటర్ శుభం జంగిర్ (28) నాలుగు నెలల క్రితం తనభార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. గత నెల 27న చర్లపల్లి రైల్వేస్టేషన్ చేరుకున్నట్లు ఇక్కడి నుంచి జనరల్ టికెట్ పై ఇంటికి తిరిగి వస్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. కానీ ఇంతవరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మజీద్ వెల్లడించారు.