సికింద్రాబాద్: క్షణాల్లో తప్పిన ప్రమాదం

10చూసినవారు
సికింద్రాబాద్: క్షణాల్లో తప్పిన ప్రమాదం
దిశ, సికింద్రాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు అదుపు తప్పి
పడిపోయింది. రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోతున్న మహిళను అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగి ( ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) సంతోష్ అప్రమత్తమై వెంటనే మహిళని పైకి లాగి రక్షించి ట్రైన్ ఎక్కించాడు. దీంతో క్షణాల్లో మహిళ ప్రమాదం నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంది. మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగి సంతోష్ను పలువురు అధికారులు, ప్రయాణికులు అభినందించారు. ఇలాంటి ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ట్రైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు అవసరం అన్నారు. కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం చేయకూడని హెచ్చరించారు. ఫుట్ బోర్డు ప్రయాణం మంచిది కాదన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ట్రైన్ ఆగినాక మాత్రమే ఎక్కాలని సూచించారు.
Sim

సంబంధిత పోస్ట్