లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే నిలయం సమీపంలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సుమారు 25-30 ఏళ్ల వయస్సున్న మృతుడి తలపై రాళ్లతో దాడి చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బుధవారం ఉదయం సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, గుర్తు తెలియని నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుడి చేతిపై 'రీనా' అనే పచ్చబొట్టు, మరోచోట 'జెఎస్' అనే అక్షరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.