సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో సోమవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. కుటుంబ సభ్యులు సమయస్ఫూర్తితో బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఇంట్లోని సామగ్రి ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వంటగదిలో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.