ట్రైన్లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే జి ఆర్ పి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం. మహారాష్ట్ర, పుణేకు చెందిన మనోరంజన్ దాస్ గంజాయి వ్యాపారి. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ శంబాజీ సులువుగా డబ్బు సంపాదించాలని అతడు ఇచ్చే కమిషన్ కోసం అక్రమంగా రైళ్లలో గంజాయిని తరలిస్తూ మంగళవారం చిక్కాడు. రూ. 14 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.