సికింద్రాబాద్: విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. వైస్ ప్రిన్సిపాల్ పై పోక్సో కేసు

2చూసినవారు
సికింద్రాబాద్: విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. వైస్ ప్రిన్సిపాల్ పై పోక్సో కేసు
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రైవేటు స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ సాయి, ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా అతను విద్యార్థిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి, అనంతరం వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ రాజేందర్ గౌడ్ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో సాయి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో సంబంధిత వైస్ ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుంచి తొలగించారు.

సంబంధిత పోస్ట్