సికింద్రాబాద్: రిటైర్డ్ ఆర్మీ జవాన్ షాపులో దోపిడీ యత్నం

1చూసినవారు
కుషాయిగూడలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస్ పై దోపిడి యత్నం జరిగింది. మనీ ఎక్సేంజ్ కౌంటర్ నడుపుతున్న శ్రీనివాస్ పై కత్తితో దాడి చేసి నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన దుండగుడిని, అప్రమత్తమైన శ్రీనివాస్ వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ ఘటనలో, దోపిడికి పాల్పడిన వ్యక్తి అమెరికా పౌరుడని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్