సికింద్రాబాద్: 2, 500 మంది పోలీసులతో బందోబస్తు

74చూసినవారు
సికింద్రాబాద్: 2, 500 మంది పోలీసులతో బందోబస్తు
ఆదివారం ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు 2, 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఆలయ ఆవరణలో శుక్రవారం జాతర కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. భక్తుల సందర్శనకు 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర రోజు మ. 1 నుంచి 3 గంటల మధ్య శివసత్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుందన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్కు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్