సికింద్రాబాద్: హాస్టల్లో యువతి అనుమానాస్పద మృతి

5చూసినవారు
సికింద్రాబాద్: హాస్టల్లో యువతి అనుమానాస్పద మృతి
తార్నాకలోని సుప్రీత డీలక్స్ ఉమెన్స్ హాస్టల్లో బంజారాహిల్స్కు చెందిన అఫ్రీన్ బీ (25) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శనివారం ఉదయం ఆమె గదిలో కిటికీ గ్రిల్కు దుపట్టాతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగి, విడాకులు తీసుకున్న అఫ్రీన్ తీవ్ర మనస్తాపంతో ఎనిమిది నెలలుగా హాస్టల్లో ఉంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన్వీర్ అనే వ్యక్తితో స్నేహం, శుక్రవారం జరిగిన వాగ్వాదం వంటి కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్