హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుంటున్న వరంగల్ జిల్లా పరకాల గ్రామానికి చెందిన శివకుమార్ (19) రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈనెల 5న తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో స్వగ్రామానికి వెళ్తుండగా, సికింద్రాబాద్ లాలాగూడ సమీపంలో ఉదయం 7.25 గంటల సమయంలో రైలు నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ బుధవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.