తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు నియోజకవర్గానికి 1000 మంది చొప్పున 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని, స్వయం ఉపాధితో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే దరఖాస్తులు స్వీకరించి, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.