అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో గురువారం రాత్రి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. “ఇందిరమ్మ ఎంత ముఖ్యమో,
ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యుడు” అని రేవంత్ రెడ్డి పేర్కొనడం రాజకీయ వర్గాల్లో విభిన్న స్పందనలకు కారణమైంది. ఎన్టీఆర్‌ను “తెలుగు జాతి గర్వకారణం”గా అభివర్ణించిన సీఎం, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు ప్రేరణగా నిలిచాయని బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజు గౌడ్ అన్నారు.