నాంపల్లిలో రైలు పట్టాలపై యువకుడి అనుమానాస్పద మృతి

1చూసినవారు
నాంపల్లిలో రైలు పట్టాలపై యువకుడి అనుమానాస్పద మృతి
శుక్రవారం ఉదయం నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చందానగర్ - లింగంపల్లి స్టేషన్ల మధ్య అఫ్లైన్ వద్ద రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం ఛిద్రమవడంతో, వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైలు ఢీకొనడం వల్ల మరణించాడా లేక హత్యకు గురయ్యాడా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్