ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త

14చూసినవారు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో తాత్కాలికంగా నిలిపివేసిన బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ పునరుద్ధరించింది. వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎంజీబీఎస్ నుంచి బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది.

సంబంధిత పోస్ట్