తెలంగాణలో దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటు

7చూసినవారు
తెలంగాణలో దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో మహిళల ఫుట్ బాల్ అకాడమీ ఇదే. దేశంలో రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సులో తెలంగాణ ఫిఫా – ఏఐఎఫ్ఎఫ్ ఫుట్ బాల్ అకాడమీల వివరాలు ప్రకటించనున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ చెస్ నిర్వహణపై కూడా సదస్సులో ప్రకటన వెలువడనుంది.