హైదరాబాద్ మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీ గార్డులుగా అవకాశం

2చూసినవారు
హైదరాబాద్ మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీ గార్డులుగా అవకాశం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా, 20 మంది ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, మహిళల భద్రతను బలోపేతం చేయడం, వారికి గౌరవం, భరోసా కల్పించడంలో భాగంగా ఈ ముందడుగు వేసినట్లు అధికారులు తెలిపారు. ఇది మహిళల భద్రతను మెరుగుపరచడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్