సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం, ఉత్సవాల 7వ రోజున అమ్మవారు శ్రీ చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.