ప్రైవేటు బస్సులను తరిమి కొడతాం

0చూసినవారు
ప్రైవేటు బస్సులను తరిమి కొడతాం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ డిపోలు, విలువైన స్థలాలను ప్రైవేటు బస్సులకు అప్పగించడాన్ని నిరసిస్తూ, ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రిక్ బస్సుల డిపోల ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ స్థలాల్లో ఆర్టీసీ బస్సులే నడవాలని, ప్రైవేటు బస్సులకు చోటు లేదని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్