సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాప్ వద్ద ఓ యువతి అదృశ్యమైంది. గోపాలపురం ఎస్సై వేణు గోపాల్ వివరాలు. మెదక్ కు చెందిన నాగేశ్ జేబీఎస్ కు వెళ్లడానికి భార్య లలిత, కోడలు రోజాతో కలిసి రేతిఫైల్ కు వచ్చాడు. బస్సు ఎక్కే క్రమంలో రోజా కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో నాగేశ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజాకి మతిస్థిమితం లేదని నాగేశ్ తెలిపారు.