
వైద్య విశ్వవిద్యాలయంలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇన్ఛార్జుల నియామకంలో ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరిన ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆరోపణలతో వీసీ డా. నందకుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.







































