
గచ్చిబౌలిలో రోడ్డుపై కారు దగ్ధం: ప్రయాణికులు సురక్షితం
శనివారం సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్న కారు ఇంజన్ నుంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం కావడంతో ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.




































