గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం చేరిన మురళీధర్ (40) మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. జీవన్ దాన్ లో లివర్ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న మురళీధర్, లివర్ వ్యాధితో 45 రోజులుగా చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ సిబ్బంది మృతుని వయసు 60 ఏళ్లుగా చూపడంతో డోనర్లు ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్య లివర్ ను భర్తకు ఇచ్చి ఆపరేషన్ చేసినా, నిన్న 14 లక్షలు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని హాస్పిటల్ సిబ్బంది చెప్పారని, ఇప్పటివరకు 85 లక్షలు బిల్లు చెల్లించామని, ఉన్న ఇల్లు అమ్మి డబ్బులు కట్టామని కుటుంబ సభ్యులు వాపోయారు. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే భర్త మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు. రాయదుర్గం పోలీసులు హాస్పిటల్ కు చేరుకున్నారు.