చందానగర్ లో దారుణం.. నైట్ ఐ హోటల్లో మహిళ హత్య...

1467చూసినవారు
చందానగర్ లోని నైట్ ఐ హోటల్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన నరసమ్మ (39) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి మెడ భాగంలో చున్నీతో బిగించి హత్య చేశాడు. సాయంత్రం హోటల్ నుండి దుండగుడు పరారయ్యాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలగొట్టి చూడగా మహిళ హత్యకు గురైనట్లు గుర్తించి హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్రమ సంబంధమే హత్యకు కారణంగా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్