మియాపూర్ పోగుల ఆగయ్య నగర్ లో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ దారుణ హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు, తన అన్నను బండరాయితో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. తరచుగా తాగి గొడవ చేస్తూ వేధిస్తున్నాడని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.