గ్రేటర్ హైదరాబాద్‌లో జీ+3తో లక్షల ఇళ్ల నిర్మాణం: ప్రభుత్వం కీలక నిర్ణయం

4చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్‌లో జీ+3తో లక్షల ఇళ్ల నిర్మాణం: ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీ+3 విధానంలో అదనంగా 2 లక్షల నుంచి 4 లక్షల మందికి సరసమైన ధరలకే ఇళ్లను అందించాలని నిర్ణయించింది. 'తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047'లో భాగంగా గృహ నిర్మాణ రంగంలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. నిర్మాణ రంగాన్ని వినూత్న పద్ధతుల్లో అభివృద్ధి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ‘క్యూర్‌, ప్యూర్‌, ఆర్వోఎస్‌’ అనే మూడు కీలక విధానాలను రూపొందించింది. ఈ ప్రణాళికలపై రూపొందించిన నివేదికను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్