రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

2113చూసినవారు
రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజాగూడ లేక్ రోడ్డులో, ఈఎసీసీఐ కాలేజీకి ఎదురుగా ఉన్న యూ-టర్న్ రోడ్డు వద్ద, డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ అనలిస్ట్ గా పనిచేస్తున్న అరవింద్ కుమార్ సింగ్ (27) అనే యువకుడు మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేర్ హాస్పిటల్ వైపు వస్తున్న సమయంలో, యూ-టర్న్ వద్ద అకస్మాత్తుగా తిరగడానికి ప్రయత్నించినప్పుడు, అదే దిశలో వస్తున్న మరో బైక్ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అరవింద్ కుమార్ సింగ్ తీవ్ర గాయాలతో మరణించాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్