గచ్చిబౌలిలోని రాజా భోజనం హోటల్‌లో అర్ధరాత్రి 50 మంది రౌడీ మూకలు హల్చల్ సృష్టించారు. హోటల్ బిల్డింగ్ యజమాని సీపీ రెడ్డికి, సబ్ లీజ్ తీసుకున్న రాజేష్‌కి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. లీజ్‌కు తీసుకున్న వారు కాకుండా వేరే వారు హోటల్ నడుపుతున్నారని, లీజ్ గడువు ముగియడంతో హోటల్ ఖాళీ చేయించిన యజమాని సీపీ రెడ్డిపై, రాజేష్ వర్గీయులు 50 మంది రౌడీ మూకలతో దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.