మొబైల్ ఫోన్ల దొంగల ముఠా అరెస్ట్

1658చూసినవారు
మియాపూర్ పోలీసులు మంగళవారం ఆరుగురు సభ్యుల మొబైల్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 20 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో రిక్షా, రెండు ద్విచక్ర వాహనాలు, 2.50 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బస్ స్టాప్‌లలో ఆటోల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్